జిల్లా వ్యాప్తంగా సర్ కార్యక్రమం ద్వారా చేసిన సర్వే ప్రకారం.. కాకినాడ జిల్లాలో 1,95,564 మందిని మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారుగా గుర్తించి వారి ఓట్లు తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ప్రచురించిన ఓటర్ల లిస్టుల్లో వీరందరి పేర్లు ఓటర్లుగానే ఉండడం గమనార్హం. పిఠాపురం మున్సిపాలిటీ– 1వ వార్డులో ఓటరు జాబితా పేజీ నంబరు 29లో వరుస నంబరు 768 బోడ పాప, ఓటరు నంబరు బీసీకే 1944461 ఈమె చనిపోయి ఐదేళ్లు అయ్యింది. ఆమె భర్త బోడ నారాయణ ఓటరు నంబరు వైఓయూ 2018430 చనిపోయి ఆరేళ్లు గడిచింది. అందుగుల పెద్దరాజు ఓటరు నంబరు వైఓయూ 2018703 చనిపోయి రెండేళ్లు అయ్యింది. తిరగతి మోషే (ఓటరు నంబరు 2020162) చనిపోయి ఏడేళ్లు, 36వ వార్డులో నేలపర్తి ముసిలి (ఓటరు నంబరు 1425776) చనిపోయి నాలుగేళ్లు అవుతోంది. వారా రాజబ్బాయి (ఓటరు నంబరు 0947681) నాలుగేళ్ల కిందట, దార్ల వీరరాఘవ (ఓటరు నంబరు వైఓయూ 0334045) ఐదేళ్ల కిందట, ప్రత్తిపాటి రాఘవ (వైఓయూ 2020576) రెండేళ్ల కిందట, సలాది వెంకటరత్నం (వైఓయూ 1285568) ఐదేళ్ల కిందట చనిపోయారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఒక్కో వార్డులో 10 నుంచి 20 వరకు మృతులకు ఓట్లు నమోదై ఉన్నాయి.
2022లో చనిపోయిన నేలపర్తి ముసిలి
2024లో చనిపోయిన తిరగటి సుజాత


