కార్తికమాస ఏర్పాట్లపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

కార్తికమాస ఏర్పాట్లపై సమీక్ష

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కార్తిక మాస ఏర్పాట్లపై దేవస్థానం సిబ్బందితో ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. కార్తిక మాసంలో శని, ఆది, సోమవారాలు, దశమి, ఏకాదశి వంటి పర్వదినాలు, క్షీరాబ్ది ద్వాదశి నాడు సత్యదేవుని తెప్పోత్సవం, కార్తిక పౌర్ణిమ నాడు గిరిప్రదక్షిణకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు. ఆ రోజుల్లో చేయాల్సిన ఏర్పాట్లపై విభాగాల వారీగా నివేదికలు అందజేయాలని సూచించారు. సమావేశంలో వైదిక కమిటీ సభ్యులు చిట్టి శివ ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, వ్రతపురోహిత సంఘం అధ్యక్షుడు ఛామర్తి కన్నబాబు, డిప్యూటీ కమిషనర్‌ బాబూరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ మంజులాదేవి, ఈఈ రామకృష్ణ. ఏఈఓలు శ్రీనివాస్‌, బలువు సత్యశ్రీనివాస్‌, అనకాపల్లి ప్రసాద్‌, కృష్ణప్రసాద్‌, ఎలక్ట్రికల్‌ డీఈ జల్లూరి సత్యనారాయణ, డీఈ (సివిల్‌) బీఎస్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement