పురుషోత్తపట్నం కాలువలో యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

పురుషోత్తపట్నం కాలువలో యువకుడి గల్లంతు

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● చేపల వేటకు వెళ్లి కొట్టుకుపోయిన వైనం

● మృతుడు దేవీపట్నం మండలం

గండికోటకు చెందిన ఆదివాసీ యువకుడు

కోరుకొండ (సీతానగరం): చేపలవేటకు వెళ్లిన యువకుడు పురుషోత్తపట్నం ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు గల్లంతైన సంఘటన ఆదివారం సీతానగరం మండలంలో చోటుచేసుకుంది. సీతానగరం ఎస్సై శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. దేవీపట్నం మండలం గండికోట గ్రామానికి చెందిన జమ్మి అర్జున్‌దొర (24) చేపలు పట్టడానికి కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలోకి జారిపోయాడు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానికులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత అర్జున్‌ దొర మృత దేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement