బువ్వ దిగడంలేదు బాబూ? | - | Sakshi
Sakshi News home page

బువ్వ దిగడంలేదు బాబూ?

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● బియ్యం ధరల పెరుగుదలపై

సగటుజీవి వేదన

● కిలో సన్న బియ్యం ధర రూ.80 పైమాటే

● మిల్లర్లు, వ్యాపారుల కుమ్మక్కు

ప్రజలకు అవస్థ

ఆలమూరు: చంద్రబాబు జమానాలో పేద, మధ్యతరగతి ప్రజలు బియ్యం కొనలేని పరిస్థితి నెలకొంది. ధాన్యాగారంగా ప్రఖ్యాతి గాంచిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బియ్యం ధరల పెరుగుదల ప్రభుత్వ చేతకానితనాన్ని సూచిస్తోంది. ప్రభుత్వ అసమర్థత, అధికారుల అలసత్వం, పౌరసరఫరాలశాఖలో అవినీతి, ప్రభుత్వ పెద్దలకు యేటా అందిస్తున్న ముడుపుల వల్ల ధరలు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిల్లర్లు, వ్యాపారులతో చంద్రబాబు సర్కార్‌ కుమ్మక్కవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గాడి తప్పుతున్న బడ్జెట్‌

పెరిగిన బియ్యం ధరలు సగటుజీవి బడ్జెట్‌ను బజారుకీడుస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలో సన్నబియ్యం కిలోకు రూ.45 నుంచి రూ.80 వరకూ చేరుకుంది. బ్రాండ్‌ ఏదైనా రూ.80 పైగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. దీంతో పాత సోనామసూరి బియ్యం 26 కేజీల బస్తా బహిరంగ మార్కెట్‌లో రూ.2050 వరకూ చేరుకుంది.

ఉమ్మడి జిల్లాలో సుమారు 350 వరకూ రైసుమిల్లులు ఉండగా దాదాపు 120 వరకూ కార్పొరేట్‌ స్థాయి రైసుమిల్లులే ఉన్నాయి. వారి వద్ద భారీగా సన్నబియ్యం అక్రమ నిల్వలు ఉన్నా చర్యలు తీసుకోలేని స్థతిలో అధికార యంత్రాంగం ఉంది.

ఇంటి బడ్జెట్‌ పెరిగిపోయింది

బియ్యం ధరల పెరుగుదలతో ఇంటి నెలవారీ బడ్జెట్‌ పెరిగిపోతోంది. కడుపు నిండా అన్నం తినాలంటే ఆలోచించే పరిస్థితిని కల్పిస్తోంది ప్రభుత్వం. – పిల్లి శ్రీనివాసు,

రైతు, పాశర్లపూడి, మామిడికుదురు మండలం.

ధరలను నియంత్రించాలి

రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. బ్లాక్‌ మార్కెట్‌ వ్యవస్థ, అక్రమ నిల్వ లు చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.–తమ్మన సుబ్బలక్ష్మి,

ఏఎంసీ మాజీ చైర్మన్‌, ఆలమూరు.

26 కేజీల బియ్యం బస్తా ధర

ధరల వ్యత్యాసం (రూపాయల్లో)

బియ్యం రకం ఏప్రిల్‌ 26 ఆగస్టు 26 అక్టోబర్‌ 2026

(రూ) (రూ) (రూ)

సోనామసూరి 1400 1750 2050

స్టీమ్డ్‌ రైస్‌ 1150 1500 1850

ఆర్‌ఎన్‌ఆర్‌ 1200 1550 1800

హెచ్‌ఎంటీ 1250 1600 1700

బీపీటీ (కొత్తరకం) 1100 1500 1700

బీపీటీ పాతరకం 1200 1650 1950

దంపుడు బియ్యం 1250 1600 1900

కార్పొరేట్‌ గుప్పెట్లో మార్కెట్లు

సాధారణంలో రాష్ట్రంతో పాటు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది టన్నుల సన్నరకాల ధాన్యాన్ని కొనుగోలు చేసి నెలల పాటు నిల్వ ఉంచి అనంతరం మిల్లింగ్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తుంటారు. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఏడాది సన్నరకాల ఉత్పత్తి అంతగా ఉండదని భావించిన కార్పొరేట్‌ సంస్థలు మిల్లింగ్‌ను భారీగా తగ్గించి కృత్రిమ కొరత సృష్టిస్తుండడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement