తొలి తిరుపతిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

తొలి తిరుపతిలో భక్తుల రద్దీ

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

సామర్లకోట: పెద్దాపురం మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో కొలువైవున్న శ్రీదేవి, భూదేవి సమేత శృంగారవల్లభ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. తొలి తిరుపతిగా పేరొందిన ఈ ఆలయానికి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున స్వామివారికి ఇచ్చిన తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. వివిధ భక్త సంఘాల నాయకులు ఆలయానికి వచ్చిన భక్తులకు సేవలందించడానికి ముందుకు వచ్చారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయ ణాచార్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించా రు. సుమారు 12 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. స్వామివారికి ప్రీతికరమైన రోజైన శనివారం కావడంతో ఆలయాన్ని పూల తో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 1,32,490, అన్నదాన విరాళాల ద్వారా రూ. 57,691, కేశఖండన ద్వారా రూ.4320, తులా భారం ద్వారా రూ.450, లడ్డు ప్రసాద విక్రయం ద్వారా రూ.19,665తో కలిపి మొత్తం రూ. 2,14616 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. ఆలయంలో మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు.

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శనివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటికిటలాడింది. శనివారం పర్వదినం కావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు నిండిపోయాయి. భక్తులు స్వామివారి వ్రతాలు ఆచరించి దర్శనం చేసుకున్నారు. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. ఐదువేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు.

‘స్థానిక’ ఎన్నికలకు

సిద్ధంగా ఉండాలి : కలెక్టర్‌

బోట్‌క్లబ్‌(కాకినాడసిటీ): త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం మున్సిపల్‌ కమిషనర్లు, జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు ముందే పూర్తిచేయాలని ఆదేశించారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన క్లియరెన్స్‌ రావాల్సి ఉందన్నారు. తుని, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంఘాల్లో వార్డు కౌన్సిలర్లు, చైర్మన్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని చెప్పారు. స్ట్రాంగ్‌ రూములు, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ పత్రాలు, బ్యాలెట్‌ బాక్సుల భద్రత కోసం అవసరమైన ప్రాంతాల్లో పటిష్టమైన స్ట్రాంగ్‌ రూములను ముందుగానే గుర్తించాలన్నారు. కౌంటింగ్‌ నిర్వహణకు విశాలమైన హాళ్లను ఎంపిక చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement