కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో వలంటీరు సేవకు ఢోకా ఉండదని భావించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాకు ఉన్న ఆధారం కూడా లేకుండా చేశారు. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి ప్రజల అవసరాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందేవిధంగా చేశాం. కరోనా సమయంలో మా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేశాం. వలంటీర్లకు అన్యాయం చేయడం సరికాదు.
– దూళ్లపల్లి రాజు, మాజీ వలంటీరు, సామర్లకోట
చంద్రబాబుకు డప్పు కొడితే డబ్బులిస్తారా?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటికే సంక్షేమ పథకాలు అందాయి. నేడు సీఎం చంద్రబాబుకు, ఆయన కూటమికి డప్పు కొడితే డబ్బులిస్తామంటున్నారు. ఇదేం విధానం. అప్పట్లో వలంటీర్లకు కేవలం రూ.5 వేలు ఇస్తేనే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. ఇప్పుడు రూ.లక్షల సొమ్ము టీడీపీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధం చేయడాన్ని ఏమంటారు.
– పోతుల మనోజ్‌కుమార్, మాజీ వలంటీర్, గంటి, కొత్తపేట మండలం


