రౌతులపూడి: నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం తన జీవితమంతా ప్రజా సేవకే అంకితం చేశారని మండల వైఎస్సార్ సీపీ శ్రేణులు అన్నారు. ముద్రగడ మృతికి సంతాపంగా రౌతులపూడిలో పార్టీ నేత వాసిరెడ్డి భాస్కరబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు బుధవారం సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బడుగు, బలహీన వర్గాల వారికే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాపుల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి ముద్రగడ అని నేతలు కొనియాడారు. ఆయన మృతి నియోజకవర్గానికే కాకుండా యావత్ రాష్ట్రానికే తీరని లోటన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గొల్లు చినదివాణం, మండల పార్టీ కన్వీనర్ సీహెచ్‌వీవీ సత్యనారాయణ, నాయకులు వాసిరెడ్డి బాబ్జీ, కాకి నాని, సర్నం శ్రీను, రాయి ప్రసాద్, సోమరౌతు తిరముల వెంకన్నదొర, గొల్లు వెంకటరమణ, పారేపల్లి శ్రీరామకృష్ణ, అచ్చిర్తి సాంభమూర్తి, కొరుప్రోలు దేవుడు, సైపురెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


