చింతూరు: ఘాట్‌రోడ్‌లో వ్యూ పాయింట్ వద్ద సోకిలేరు వాగులో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మన్యం అందాలు తిలకించేందుకు వచ్చిన పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలేనికి చెందిన పెండెం కల్యాణ్, పెండెం బాబి మంగళవారం వ్యూ పాయింట్ వద్ద సోకిలేరు వాగులో గల్లంతైన సంగతి విదితమే. మంగళవారం రాత్రి వరకు వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో బుధవారం ఉదయం నుంచి తిరిగి వాగులో వెతుకులాట ప్రారంభించారు. చింతూరు సీఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్సై అబ్దుల్ నాసిర్‌హుస్సేన్ పర్యవేక్షణలో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు తాళ్లు, కర్రల సాయంతో సాయంత్రం వరకు వెతికినా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి వాగు ఉధృతి మరింత పెరగడంతో గల్లంతైన వారు దిగువకు కొట్టుకుపోయే అవకాశముందని పలువురు అనుమానిస్తున్నారు.


