అమలాపురం రూరల్: క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 16, 17, 23 తేదీల్లో జరిగే అమరావతి రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్ పోటీల కోసం బాలయోగి స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎల్ఆర్ రుద్ర ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, యోగా, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్ తదితర క్రీడాంశాల్లో ఎంపికలు జరిగాయి. నియోజకవర్గం స్థాయిలో అర్హత కలిగిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 100 బాలురు, 80 మందికి బాలికలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు పందిరి శ్రీహరిరామ్‌గోపాల్, గెడ్డం సంపదరావు, ఎంపీడీఈఓ ఉండ్రు బాబ్జీరాజు, రూరల్ సీఐ ప్రశాంతకుమార్, పీఈటీలు, గణేష్, ఈశ్వరరావు, భీమేశ్వరరావు, కామన మధుసూదనరావు, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.


