అమ్మ పాలుకరింపు మంచిదే.. | - | Sakshi
Sakshi News home page

అమ్మ పాలుకరింపు మంచిదే..

Jul 30 2026 12:27 AM | Updated on Jul 30 2026 12:27 AM

రాయవరం: తల్లి పాలు అమృతంతో సమానం. పుట్టిన మరుక్షణం నుంచి కనీసం ఆరు నెలలైనా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ తదితర అంతర్జాతీయ సంస్థలతో పాటు, జాతీయ సంస్థలు తల్లిపాల ప్రాధాన్యాన్ని తెలియజెప్పేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, వైద్యశాఖలు సంయుక్తంగా ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫర్‌ ఏ సస్టైనబుల్‌ స్టార్ట్‌ ఇన్‌ లైఫ్‌’ అనే నినాదంతో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇదీ..

కాకినాడ జిల్లాలో 1,986 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 10,121 మంది గర్భిణులు, 7,856 మంది బాలింతలు, 0–6 నెలల్లోపు చిన్నారులు 7,567, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 46,301, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 21,851 మంది ఉన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో..

కోనసీమ జిల్లాలో 1,484 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 5,846 మంది గర్భిణులు, 7,725 మంది బాలింతలు, 0–6 నెలల లోపు చిన్నారులు 5,840, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 32,173, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 20,504 మంది ఉన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లాలో 1,798 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 9,419 మంది గర్భిణులు, 7,373 మంది బాలింతలు, 0–6 సంవత్సరాల చిన్నారులు 6,704, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 42,964, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 27,182 మంది ఉన్నారు.

ఏటా అవగాహన కల్పిస్తున్నాం

తల్లిపాల విశిష్టతను తెలియజేసేందుకే తల్లులకు ఏటా అవగాహన కల్పిస్తున్నాం. తల్లిపాల వారోత్సవాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా తల్లిపాల విశిష్టతను గర్భిణులుగా ఉన్నప్పుడే వివరిస్తున్నాం. తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆదేశాలు ఇస్తున్నాం.

– కె.నాగమణి, పీడీ,

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

బిడ్డకు ముర్రుపాలే తొలి టీకా

పుట్టిన వెంటనే బిడ్డకు పడితే ఆరోగ్యం

శిశు మరణాల నియంత్రణకు చెక్‌

ఆగస్టు 1 నుంచి 7 వరకు

తల్లిపాల వారోత్సవాలు

జిల్లాలో 9,479 మంది గర్భిణులు, 7,373 మంది బాలింతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement