రావులపాలెం: జాతీయ రహదారిపై రావులపాలెంలోని కళా వెంకట్రావు సెంటర్లో సోమవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. కోల్‌కతా నుంచి భీమవరానికి బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన గొట్టాలను ఈ లారీలో తీసుకువెళుతున్నారు. రావులపాలెం వద్ద డ్రైవర్‌కు నిద్రమత్తు వచ్చి, డీవైడర్‌ను ఢీకొనడంతో లారీ బోల్తా కొట్టింది. ఆ సమయంలో అక్కడ ట్రాఫిక్ లేకపోడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డైవరుకు స్వల్ప గాయాలు అయ్యాయి. హైవే, పోలీసులు అధికారులు గొట్టాలను వేరే లారీపైకి లోడ్ చేయించి క్రేన్ సాయంతో లారీని తొలగించారు.


