ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా | - | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

దేవరపల్లి: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్లజర్ల మండలం దూబచర్లలో ఆదివారం జరిగింది. తన ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆమె బైఠాయించి పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా వాడుకుని, ముఖం చాటేస్తున్న అనిల్‌ కుమార్‌కు డీఎన్‌ఏ పరిక్ష చేసి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేసింది. సంఘటనకు సంబంధించి బాధితురాలి కథనం ప్రకారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన అడబాల హేమలత నల్లజర్ల మండలం దూబచర్లలో ఓ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్‌కుమార్‌ తనకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని లొంగదీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా అలాగేనని నమ్మించి ముఖం చాటుశాడని ఆమె తెలిపారు. దీనిపై ఏడాది క్రితం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది. అయినప్పటికి తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తనను మోసం చేసిన వ్యక్తికి ఇంతవరకు డీఎన్‌ఏ పరీక్ష చేయించలేదని ఆమె తెలిపారు. ఆమె తల్లి అడబాల లక్ష్మి కుమార్తెకు అండగా ఉన్నారు. దీనిపై నల్లజర్ల సీఐ రవికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ సంఘటన 2025లో జరిగిందన్నారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే అనిల్‌కుమార్‌కు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement