నా వయస్సు 83 సంవత్సరాలు. 38 ఏళ్ల పాటు సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌టీఐ) ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. నెలకు నాకు రూ.600 పెన్షన్ వస్తుంది. ఈ వృద్ధాప్యంలో ఏమీ చేయలేని పరిస్థితి. ఉద్యోగ విరమణ తరువాత జీవితం దుర్భరంగా మారింది.
– కస్తూరి రామచంద్రరావు,
రిటైర్డ్ ఉద్యోగి
వైద్య ఖర్చులకు సరిపోవడం లేదు
నా వయస్సు 71 సంవత్స రాలు. ఆర్టీసీలో 36 ఏళ్ల పాటు గ్రేడ్–3 ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి రిటైరయ్యాను. ప్రతి నెల నాకు ఈపీఎఫ్‌ఓ ద్వారా రూ.2475 మాత్రమే అందుతుంది. వైద్య ఖర్చులకు ఏ మాత్రం సరిపోని దుస్థితి. కేంద్ర ప్రభుత్వం కనీస పింఛన్ రూ.9 వేలకు పెంచి రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలి.
– ఓఆర్ బాబు, రిటైర్డ్ ఉద్యోగి,
రాజమహేంద్రవరం
జీవితం దయనీయం
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జీవితం దయనీయంగా ఉంది. నిత్యావసరాల కొనుగోలు మాట అటుంచితే ఆరోగ్యం కోసం మందులు కొనుగోలుకు సైతం ఉపయోగం లేని పెన్షన్ ఇస్తున్నారు. తక్కువ పెన్షన్ అందుతున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ మంజూరయ్యే విధంగా వెసులుబాటు కల్పించాలి.
– యర్రంశెట్టి కొండలరావు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
●


