బోట్‌క్లబ్ (కాకినాడ): కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ సోమవారం ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వెల్లడించారు. సమసమాజ స్థాపన, జాతి హక్కుల కోసం ముద్రగడ అలుపెరగని పోరాటం చేశారన్నారు. ప్రజల హక్కుల సాధనకు ఆయన, ఆయన కుటుంబం చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. ఆయన సేవలను స్మరించుకుని, ఘన నివాళులు అర్పించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభలో వైఎస్సార్ సీసీ శ్రేణులు, కార్యకర్తలు, ముద్రగడ అభిమానులు పాల్గొని ఘన నివాళులు అర్పించాలని కోరారు.


