అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ షాపులను లీజుకు తీసుకున్న వ్యాపారులు రూ.నాలుగు కోట్ల బకాయిలు పెట్టిన వైనంపై ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘కొండంత భారం’ శీర్షికన వచ్చిన కథనం వచ్చింది. దీనికి స్పందించిన దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ఆదివారం ఆ దుకాణాలను పరిశీలించారు. ఆయా షాపుల నిర్వాహకులు చెల్లించాల్సిన బకాయిల గురించి సంబంధిత విభాగం ఏఈఓ అనకాపల్లి ప్రసాద్‌ను వివరణ కోరారు. సోమవారం ఉదయం దేవస్థానంలో జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ లీజు బకాయిలతో పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు.


