గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Jul 24 2026 12:40 AM | Updated on Jul 24 2026 12:40 AM

మోతుగూడెం: మోటారు సైకిల్‌పై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను డొంకరాయి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై చరణ్‌ నాయక్‌ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి గుంటూరుకు పది కేజీల గంజాయిని బైక్‌పై ఇద్దరు యువకులు తరలిస్తున్నారు. గుర్తేడు మండలం బొడ్డుగంటి పంచాయతీ పరిధిలో డొంకరాయి చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో గంజాయిని, వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. గుంటూరుకు చెందిన సద్దాం పవన్‌ మాధవ్‌, కుందేటి చెన్నకేశవరావును అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేసి రిమాండ్‌ తరలించారు.

లోవలో జంతుబలి నిషేధించాలి

తుని రూరల్‌: తలుపులమ్మ లోవ దేవస్థానంలో జంతుబలి, మద్యాన్ని నిషేధించాలని కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు అన్నారు. ఆయన గురువారం కుటుంబ సభ్యులతో లోవ దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠం తరఫున అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, మహా హారతి సేవలు నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. లోవలో జంతువులను వధించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నిషేధించాలని కోరుతూకార్యనిర్వహణ అధికారికి లేఖ ఇచ్చినట్టు తెలిపారు.

బ్యాడ్మింటన్‌ పోటీలకు ఏర్పాట్లు పూర్తి

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): కాకినాడ శ్రీ ప్రకాష్‌ స్కూల్లో ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించనున్న సీబీఎస్‌ఈ క్లస్టర్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని పాఠశాల డైరెక్టర్‌ విజయ ప్రకాష్‌ గురువారం తెలిపారు. ఈ పోటీలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 700 మంది క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు. అండర్‌–14, 17, 19 విభాగాల్లో సింగిల్స్‌, డబుల్స్‌లో పోటీలు జరుగుతాయని, ఇందుకోసం నాలుగు కోర్టులను ఫ్లడ్‌లైట్లతో సిద్ధం చేశామన్నారు. పాల్గొనే వారు పాస్‌పోర్టు సైజు ఫొటో, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న పత్రాలు, ప్రిన్సిపాల్‌తో కూడిన గ్రూప్‌ ఫొటోతో హాజరు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement