కాకినాడ రూరల్: సమగ్ర శిక్షా పీఎంశ్రీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్‌లో తిమ్మాపురం గ్రామానికి చెందిన భవిత సెంటర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థి రెడ్డి భరద్వాజ ప్రతిభ చూపాడు. 400, 100 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు, షాట్‌ఫుట్‌లో కాంస్య పతకం సాధించినట్టు కాకినాడ రూరల్ ఐఈఆర్టీ వెంకటలక్ష్మి తెలియజేశారు. భరద్వాజను ఎంఈఓలు ఈశ్వర శాస్త్రి, బి.శ్రీనివాస్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో పీడీ జయలక్ష్మి, భవిత సెంటర్‌కు చెందిన వీర గణేష్ పాల్గొన్నారు.
పవర్ లిఫ్టింగ్‌లో
కానిస్టేబుల్ సత్తా
అల్లవరం: ఓడలరేవు మైరెన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బి.అప్పన్న జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి వెండి పతకం గెలుచుకున్నాడు. మహారాష్ట్రలోని జౌరంగబాద్లో ఈ నెల 18 నుంచి 21 జరిగిన మాస్టర్స్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 120 కేజీల విభాగంలో ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను గురువారం అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్‌లో కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్షుడు యనుముల పద్మరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అప్పన్న గతంలో రెండు సార్లు 550 కేజీల బరువుల ఎత్తి, జాతీయ స్థాయి విజేతలుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


