రాయవరం: విద్య, యోగా, ఆధ్యాత్మిక, ధార్మిక, వైద్యం, సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే వంటి రంగాల్లో ప్రతిభ చూపుతున్న ఉపాధ్యాయుల నుంచి గురుబ్రహ్మ, గురు శిరోమణి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకోవాలని సర్వేజనా సుఖినోభవంతు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, లయన్ డాక్టర్ ఈఎస్‌ఎస్ నారాయణ గురువారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతో పాటు ప్రతిభను తెలిపే సర్టిఫికెట్లు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్‌లు, గతంలో పొందిన పురస్కారాల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను ఈ నెల 31వ తేదీలోగా పంపించాలన్నారు. సర్వేజనా సుఖినో భవంతు, డోర్ నంబరు 1–20–164, తిరుమలగిరి, గోకుల్‌నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్–15 నంబరుకు పోస్టు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 96523 47207 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


