అలజడితో వేటకు దూరం | - | Sakshi
Sakshi News home page

అలజడితో వేటకు దూరం

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

అలల తీవ్రత

పెరుమాళ్లపురంలో పోర్టు నిర్మాణంతో మా గ్రామాల తీరంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. బోట్లపై సముద్రంలోకి వెళ్లేందుకు ఏమాత్రం వీలుండడం లేదు. పెరుమాళ్లపురం ప్రాంతంలో అలల తీవ్రత తక్కువగా ఉంది. మాకు అక్కడి నుంచి వెళ్లేందుకు అవకాశం కల్పించాలి.

– చొక్కా దేవుడు, బోటు యజమాని, నర్శిపేట

ఇబ్బందులు గుర్తించాలి

కెరటాల ఎక్కువగా రావడంతో సముద్రంలోకి బోటు వేసుకుని వెళ్లలేకపోతున్నాం. ఇప్పటికే చేపలు సరిగ్గా పడక డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు అలల పుణ్యమా అని బోట్లపై వేటకు వెళ్లలేకపోతున్నాం. మా ఇబ్బందులను పోర్టు యాజమాన్యం గుర్తించాలి.

– అర్జిల్లి ప్రసాద్‌, మత్స్యకారుడు, దానవాయిపేట

తొండంగి: బోట్లపై సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి కుటుంబాలను పోషించుకునే మత్స్యకారులు ప్రస్తుతం బతకడానికి పోరాటం చేస్తున్నారు. కడలిలో అలల ఉధృతి పెరగడంతో లోపలకు వెళ్లలేకపోతున్నారు. ఒక వేళ వెళ్లినా బోట్లు తిరగబడి ప్రమాదాలకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తొండంగి మండలం పెరుమాళ్లపురంలో కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో సముద్రంలో కొంత భాగం వరకూ పోర్టు బోట్లు నిలిచేందుకు వీలుగా ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. దీని ప్రభావంతో పరిసర గ్రామాల పరిధిలోని సముద్ర తీరంలో అలల ఉధృతి ఎక్కువైంది. దానవాయిపేట, నర్శిపేట, వాడములసయ్యపేట, ఎల్లయ్యపేట వరకు ఈ ప్రభావం చూపుతోంది. ఆయా గ్రామాల్లో వేటపై ఆధారపడిన మత్స్యకారులు తమ బోట్లపై సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

సుమారు 70 బోట్లు

ఆయా గ్రామాల్లో సుమారు 70 వరకూ బోట్లు ఉన్నాయి. ఒక్కో బోటుపై ఎనిమిది నుంచి పది మందికి పైగా వేటకు వెళ్తుంటారు. అలల ఉధృతి కారణంగా వీరందరూ ప్రస్తుతం వేటకు వెళ్లలేనిస్థితిలో ఉన్నారు. అయితే పెరుమాళ్లపురానికి చెందిన మత్స్యకారులు సముద్ర తీరం నుంచి సునాయాసంగా సముద్రంలో బోట్లు వేసుకుని వేట సాగిస్తున్నారు. దీంతో తమకు కూడా అక్కడి నుంచి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని దానవాయిపేట, వాడముసలయ్యపేట, నర్శిపేట తదితర గ్రామాల మత్స్యకారులు పోర్టు యాజమాన్యాన్ని రెండు రోజుల క్రితం కోరారు. అయితే పోర్టులో ఎగుమతి, దిగుమతులతో పాటు అభివృద్ధి ఇబ్బంది కలుగుందని పోర్టు ప్రతినిధులు నిరాకరించారు. దీంతో ఈ విషయంపై గురువారం మరోసారి చర్చించనున్నారు.

ఫ పెరుమాళ్లపురంలో

పోర్టు గేట్‌వే నిర్మాణం

ఫ సముద్రంలో పెరిగిన అలల ఉధృతి

ఫ వేటకు వెళ్లేందుకు

మత్స్యకారుల అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement