ముద్రగడ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

ముద్రగడ సేవలు చిరస్మరణీయం

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

గిరిబాబు, వీరరాఘవరావును పరామర్శిస్తున్న సత్యనారాయణరాజు, నాగమోహన్‌కృష్ణ

కిర్లంపూడి: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు దివంగత ముద్రగడ పద్మనాభం సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్‌ సీపీ కాకినాడ జిల్లా పరిశీలికులు దాట్ల సూర్యనారాయణరాజు అన్నారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి బుధవారం రాష్ట్ర నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, అభిమానులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆయన కుమారులు వైఎస్సార్‌ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు, ముద్రగడ వీరరాఘవరావు(బాలు)ను పరామర్శించారు. ముద్రగడ సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారిని పరామర్శించిన వారిలో వైఎస్సార్‌ సీపీ రేపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి పీటా నాగమహన్‌కృష్ణ, తెదేపాకు చెందిన పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ, అంతర్జాతీయ శిల్పకారుడు ఆచార్య దేవగుప్తాపు రాజ్‌కుమార్‌ వడియార్‌, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాల ప్రజలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement