తుని రూరల్: స్వల్ప అస్వస్థతకు గురై విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, ఇసం రామకృష్ణ, చొక్కా హరిబాబు తదితరులు పరామర్శించారు. తన ఆరోగ్యంపై నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని, ఆస్పత్రికి ఎవరూ రావద్దని రాజా అన్నారు.


