నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విశాఖలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పలు విభాగాల్లో పతకాలు సాధించారు. జిల్లా స్విమ్మింగ్ సంఘ కార్యదర్శి ఐ.రాజు మంగళవారం ఈ విషయం తెలిపారు. గ్రూప్ –1లో సాయి మహాలక్ష్మి, శ్రీలాస్య బెస్ట్ స్ట్రోక్, బ్యాక్‌స్ట్రోక్‌లో బంగారు పతకాలు, ఫ్రీ స్టైల్‌లో కాంస్య పతకాలు సాధించారన్నారు. గ్రూప్ –2లో షణ్ముక్ వీర్ బ్యాక్ స్ట్రోక్‌లో బంగారు, బ్యాక్ స్ట్రోక్ లో రజత, బటర్ ఫ్లైలో కాంస్య పతకం, విరాజ్ విజయ్ బటర్ ఫ్లైలో రజత, ఫ్రీ స్టైల్‌లో కాంస్యం గెలుపొందాన్నారు. గ్రూప్ – 3లో సాయి చరణ్ బ్రెస్ట్ స్ట్రోక్‌లో బంగారు, బ్యాక్ స్ట్రోక్‌లో రజతం, ఎం.యశస్వి, తుషాంత్ ఫ్రీ స్టైల్, బ్రెస్ట్ స్ట్రోక్‌లో కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను డీఎస్‌డీఓ సతీష్ కుమార్, అసోసియేషన్ సభ్యులు అభినందించారు. భువనేశ్వర్‌లో ఆగస్టులో జరిగే జూనియర్ నేషనల్స్‌కు సాయి మహాలక్ష్మి, శ్రీలాస్య, అలాగే జైపూర్‌లో జరిగే సబ్ జూనియర్ నేషనల్స్‌కు సాయి చరణ్, రిషి సాత్విక్, షణ్ముక్ వీర్, విరాజ్, యశస్విమేధ ఎంపికయ్యారు.


