వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

Jul 19 2026 12:15 AM | Updated on Jul 19 2026 12:15 AM

తొండంగి: ప్రేమించాలని వెంటపడిన యువకుడు, అతని స్నేహితుల వేధింపులతో మనస్తామానికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మండలం వేమవరం పంచాయతీ వాడపంపాదిపేటలో మృతురాలి తల్లి పోలీసులకు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మత్స్యకార కుటుంబానికి చెందిన పల్లేటి బాబూరావు, సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రజని డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. అదే గ్రామానికి చెందిన గోసల రాజేంద్ర నాలుగేళ్ల క్రితం రజనితో చనువుగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు ఉప్పాడ కొత్తపల్లికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో రజని అతనితో దూరంగా ఉండేది. ఇది భరించలేక ఈనెల 16న రాజేంద్ర పురుగు మందు తాగాడని దుష్ప్రచారం చేశారు. దీంతో యువతి తల్లి రాజేంద్ర, అతని స్నేహితుడు ఇళ్ల ప్రసాద్‌లకు ఫోన్‌ చేసి వివాహం నిశ్చయమైన తర్వాత ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించింది. రాజేంద్రకు ఏమైనా జరిగితే మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తామని, అలా కాకుండా ఉండాలంటే రజనీతో రాజేంద్రకు పెళ్లి చేయాలని బెదిరించారు. యువతి అమ్మమ్మ ఇంటికి రాజేంద్ర వెళ్లి గొడవ చేయడంతో శుక్రవారం రజని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి సుజాత ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement