సాంకేతికతకు అనుగుణంగా విద్యా విధానం | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతకు అనుగుణంగా విద్యా విధానం

Jul 15 2026 1:46 AM | Updated on Jul 15 2026 1:46 AM

డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి

జేఎన్‌టీయూకేలో ఓక్‌ జూబ్లీ ఉత్సవాలు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యావిధానం సాగాలని డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు జి.సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. జేఎన్‌టీయూ కాకినాడ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పడి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఓక్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీఇంటర్నేషనల్‌ సింపోజియం ఆన్‌ రీసెంట్‌ ట్రెండ్స్‌ ఇన్‌టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌శ్రీ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నేడు పరిశ్రమలకు నైపుణ్యాలతో కూడిన వ్యక్తుల అవసరం ఉందని, పరిశ్రమలు విద్యా వ్యవస్థ మధ్య అంతరాన్ని తొలగించాలన్నారు. రాబోయే యుద్ధాలను భారత ఇంజినీర్లు తమ శక్తి మేరకు ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలన్నారు. జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ మాట్లాడుతూ భారతదేశంలో మిలియన్‌కు 260 మంది మాత్రమే నిపుణులు ఉండగా చైనాలో మిలియన్‌కు వెయ్యిమంది ఉన్నారని, వరల్డ్‌ క్లాస్‌ యూనివర్సిటీలను నిర్మించడం కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మార్గాలు అన్వేషించాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ సుబ్బారావు, ప్రిన్సిపాల్‌ కె.పద్మరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ దీక్షితులు, స్వరూపరాణి, మాజీ వీసీలు డాక్టర్‌ ప్రసాదరాజు, మురళీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement