పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షల అనంతరం జిల్లావ్యాప్తంగా ముస్లింలు శనివారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరు తూ మసీదుల వద్ద సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. మత పెద్దలు ఖురాన్ చదివి వినిపించారు. సంపాదించిన దానిలో పేదలకు కొంత దానధర్మాలు చేయాలని, అలా చేసే వారి పట్ల అల్లాహ్ దయ ఎన్నటికీ ఉంటుందని చెప్పారు. కాకినాడ జేఎన్‌టీయూకే వద్ద ఈద్గా మైదానంలో వేలాదిగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో దువా నిర్వహించారు. మెయిన్ రోడ్డు లోని పెద్ద జామియా మసీదు ఇమామ్ అబ్దుల్ రజా క్ రిజ్వీ ఈద్ నమాజ్ నిర్వహించారు. ఆయనను నూరానీ జమాల్ తనయుడు బేర్ తరఫున నూరానీ కమిటీ సభ్యులు రెహ్మన్‌ఖాన్, లతీఫీఖాన్‌లు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు ఎస్‌ఏ జాజుద్దీన్, ప్రముఖ న్యాయవాదులు ఎస్‌కే మొహీద్దీన్, జవహర్ ఆలీ, ప్రముఖ వ్యాపారులు అలీషా తదితరులు పాల్గొన్నారు.
– బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ)


