మహానీయుడు పొట్టి శ్రీరాములు | - | Sakshi
Sakshi News home page

మహానీయుడు పొట్టి శ్రీరాములు

Mar 17 2026 7:34 AM | Updated on Mar 17 2026 7:34 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ఆత్మార్పణం చేసిన గొప్ప మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ మూల పురుషుడు అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక సీబీఎం స్కూల్‌ సెంటర్‌ వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి కలెక్టర్‌ సోమవారం పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు బాటలు వేసి, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

33 పోస్టులకు

452 దరఖాస్తులు

కాకినాడ క్రైం: గత ఏడాది డిసెంబర్‌ 15న రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్‌, అల్‌లైడ్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం పది కేటగిరీల్లోని 33 పోస్టులకు 452 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టును ఆన్‌లైన్‌లో పొందుపరిచామని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అత్తలూరి విష్ణువర్ధన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులు apego@nic.in, rmckakinada.com వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసిన మెరిట్‌ లిస్టులో తమ పేర్లు పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలుంటే తగిన పత్రాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. మంగళవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ వారం రోజుల పాటు తమ కళాశాలలో పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అభ్యంతరాలు స్వీకరిస్తామని డాక్టర్‌ విష్ణువర్ధన్‌ తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌కు 498 అర్జీలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 498 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ షణ్మోహన్‌, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, వివిధ సంక్షేమ పథకాల లబ్ధి వంటి వాటిపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

24¯]l A£ðlÏ-sìæMŠS​ G…í³MýSË$

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 24న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ)లో నిర్వహిస్తున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) వి.సతీష్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. 35, 45 సంవత్సరాలు పైబడిన విభాగంలో పురుషులు, మహిళలకు ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో, జావలిన్‌త్రో, 4ఘ400 మీటర్ల రిలేలో ఎంపికలు నిర్వహిస్తామని వివరించారు. అర్హులైన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. కాకినాడ డీఎస్‌ఏలో ఆ రోజు ఉదయం 7 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని తెలిపారు. వివరాలకు 94400 31601 నంబరులో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement