రాష్ట్రంలో దారుణంగా శాంతిభద్రతలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దారుణంగా శాంతిభద్రతలు

Feb 3 2026 7:42 AM | Updated on Feb 3 2026 7:42 AM

రాష్ట్రంలో దారుణంగా శాంతిభద్రతలు

రాష్ట్రంలో దారుణంగా శాంతిభద్రతలు

కొత్తపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉందని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు, పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడి, ఆయన ఇంటిని తగులబెట్టడమే కాకుండా, బాధితుడైన ఆయనను అక్రమంగా అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కోపంతో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తూ, ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రసాదం పవిత్రతను కాపాడాల్సిన వారే ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం చాలా దారుణమన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ జగన్‌, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఎవరు ప్రోత్సహించారు, పెట్టిన వారి పేర్లు, ఫొటోలు కూడా ఆ ఫ్లెక్సీలో ఉండాలి కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా సోషల్‌ మీడియాపై కేసులు పెట్టారన్నారు. వారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేసిన వారిపై కేసులు పెట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అమ్మ ఒడి, ఉపాధి హామీ పథకం వేతనం, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌, అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో భద్రత ఎక్కడ ఉందని గీత ప్రశ్నించారు. మారణాయుధాలతో వచ్చిన వారికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు.

శాంతిభద్రతలు లేవని కేంద్రమే చెప్పింది

దేశంలో తరచూ అల్లర్లు జరిగే జమ్మూ కాశ్మీర్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాల్లో శాంతిభద్రతలు బాగా ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు లేవనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే రెండు నెలల క్రితం ప్రకటించిందని గీత గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులు, సోషల్‌ మీడియా కార్యకర్తలకు రక్షణ కరువైందన్నారు. జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడుతున్న వారిని బెదిరిస్తున్నారని, కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయని, ఏ ఒక్కదానిపైనయినా ఐజీతో సమీక్షించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి

ఇప్పటికై నా లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారం నిలుపు చేయాలని, అక్రమ కేసులు బనాయించడాన్ని ఆపాలని, రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గీత డిమాండ్‌ చేశారు. ఫ్లెక్సీల వద్ద కర్రలు పట్టుకుని ఉన్న వారిపై, ఇళ్లకు నిప్పంటించిన గూండాలపై ఏ చర్యలు తీసుకున్నారని, ఎంతమందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, కేసులు పెట్టారో చెప్పాలని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదంపై సీబీఐ సిట్‌ ఇచ్చిన నివేదికను ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలకు కూడా లడ్డూ ప్రసాదంపై చేస్తున్న తప్పుడు ప్రచారంలో బాధ్యత ఉంటుందని గీత స్పష్టం చేశారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నేతలు గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, సోమరౌతు లలిత, పెదపాటి నాగేశ్వరరావు, కరణం చిన్నారావు, పచ్చిమళ్ళ అప్పలరాజు, మొహిద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ తప్పుడు కేసులు మానాలి

ఫ తిరుమల లడ్డూ ప్రసాదంపై కల్తీ ప్రచారాన్ని ఆపాలి

ఫ వైఎస్సార్‌ సీపీ నేత వంగా గీత డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement