వేషం కట్టి.. అదరగొట్టి
అనపర్తి: వేషం కట్టారు.. అదరగొట్టారు.. అందరినీ ఆకట్టుకున్నారు.. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖ్యాతి గాంచిన అనపర్తి మండలం కొప్పవరం కర్రివారి సత్తెమ్మ తల్లి సంబరాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలు గత నెల 31న ప్రారంభమయ్యాయి. చివరి రోజు పెద్ద సంబరంలో గ్రామస్తులు వివిధ రకాల వేషాలు కట్టి భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఘట్టంలో చిన్నా, పెద్దా, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వేషాలు కట్టి జోలె పట్టారు. తెల్లవారుజాము నుంచి ఈ సంబరం ఆద్యంతం సరదాగా సాగింది. ఈ వేడుకలు తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గ్రామంలో సందడి నెలకొంది. వేలాదిగా వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద వితరణ జరిగింది. సత్తెమ్మ తల్లిని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి నల్లమిల్లి విజయరెడ్డి, ఉప సర్పంచ్ మల్లిడి వీర్రాఘవరెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లభశెట్టి రామసతీష్, కుతుకులూరు ఉప సర్పంచ్ సబ్బెళ్ల నాగిరెడ్డి, కొప్పవరం మాజీ సర్పంచ్ తాడి సూరారెడ్డి పాల్గొన్నారు.
–ఫొటోలు: గరగ ప్రసాద్, ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్
వేషం కట్టి.. అదరగొట్టి
వేషం కట్టి.. అదరగొట్టి
వేషం కట్టి.. అదరగొట్టి
వేషం కట్టి.. అదరగొట్టి
వేషం కట్టి.. అదరగొట్టి
వేషం కట్టి.. అదరగొట్టి
వేషం కట్టి.. అదరగొట్టి
వేషం కట్టి.. అదరగొట్టి
వేషం కట్టి.. అదరగొట్టి


