● అరటి గెల.. ఆకట్టుకునేలా..
మామిడికుదురు: అరటి చెట్టు చివరి భాగంలో గెల వేయడం సర్వ సాధారణం. కానీ దానికి భిన్నంగా చెట్టు మధ్యలో వేసిన గెల ఆకట్టుకుంటోంది. పెదపట్నంలంక గ్రామంలో బండారు మాణిక్యాలరావు ఇంటి పెరట్లో బొంత అరటి చెట్టుకు మధ్యలో గెల వేసింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న ఈ చెట్టును పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీనిపై మండల ఉద్యానశాఖాధికారి దిలీప్‌ను మంగళవారం వివరణ కోరగా.. నేలలో తగిన తేమ లేకపోవడం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఈ విధంగా జరగుతుందన్నారు. దీనిని వ్యవసాయ పరిభాషలో చోకింగ్ లేదా అంతర్గత ఒత్తిడి అని పిలుస్తారని చెప్పారు.


