జీఎస్టీ.. ఎగ్గొట్టి | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీ.. ఎగ్గొట్టి

Jan 7 2026 7:45 AM | Updated on Jan 7 2026 7:45 AM

జీఎస్

జీఎస్టీ.. ఎగ్గొట్టి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలంగాణతో పాటు మన రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వారి ఆధార్‌ కార్డులతో కొంత మంది మాయగాళ్లు కాకినాడ పరిసర ప్రాంతాల్లోని చిరునామాలతో తుక్కు ఇనుము (ఐరన్‌ స్క్రాప్‌), జీడిపప్పు తదితర వ్యాపారాలు నిర్వహించే కంపెనీలు పెట్టారు. ఈ ప్రబుద్ధులు జీఎస్టీకి ఎగనామం పెడుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. దీనిపై వారు తీగ లాగడంతో బినామీల డొంక కదిలింది. ఆ మాయగాళ్లు భారీగా జీఎస్టీ ఎగ్గొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం ఏడాది క్రితమే జరిగినప్పటికీ.. కాకినాడ డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌ పరిధిలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఎగవేతదారుల ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 12 మంది పేరిట జీఎస్టీ ఎగ్గొట్టినట్టుగా వాణిజ్య పన్నుల శాఖ కాకినాడ డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయం బహిరంగ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఎగవేసిన కంపెనీలు ఎవరెవరి పేరున ఉన్నాయో వారి పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, అడ్రస్‌లతో కూడిన ఫ్లెక్సీలను జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయంతో పాటు కాకినాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. ఇవి కొన్ని మాత్రమేనని, వీరందరూ వివిధ కంపెనీల పేరిట కాకినాడలో లావాదేవీలు నిర్వహించి, జీఎస్టీ ఎగ్గొట్టేశారన్నది ఆ ప్రకటన సారాంశం. నోటీసు బోర్డులో పేర్లున్న వారిలో కొందరు.. అసలు ఆ కంపెనీ ఏమిటి, జీఎస్టీ అంటే ఏమిటి, తామెందుకు చెల్లించాలని ఎదురు ప్రశ్నలు వేయడం సంబంధిత అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రూ.20 కోట్లు పైగా..

జీఎస్టీ ఎగవేసిన ప్రబుద్ధులు మొదట అమాయకుల ఆధార్‌ కార్డులు సంపాదించి.. వాటి ఆధారంగా కాకినాడ ఇండస్ట్రియల్‌ ఏరియాతో పాటు ఆటోనగర్‌, రమణయ్యపేట, పెద్దాపురం ఇండస్ట్రియల్‌ ఏరియా, తుని తదితర ప్రాంతాల్లో కంపెనీలు ప్రారంభించారు. ఆ కంపెనీల పేరుతో పాత ఇనుము టెండర్లలో పాల్గొని, పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలైన కాకినాడ పోర్టు, షిప్పింగ్‌ కంపెనీల వంటి వాటిల్లో పాత ఇనుము కొనుగోలు టెండర్లలో వీరు బినామీ కంపెనీల పేర్లతో పాల్గొని, జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించారు. పేరుకు ఏడెనిమిది కంపెనీలు టెండర్లలో పాల్గొన్నట్టు చూపించి.. అంతా సిండికేట్‌ అయి, ఒకరి పేరునే ఖాయం చేసుకోవడం ఈ టెండర్లలో పరిపాటి అని చెబుతున్నారు. టెండర్లు దక్కించుకున్న కంపెనీల పేరిట వ్యాపార లావాదేవీలు జరిపి, జీఎస్టీకి ఎగనామం పెట్టారు. ఈవిధంగా కాకినాడతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎగ్గొట్టిన జీఎస్టీ రూ.20 కోట్లు పైనే ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ 12 మందిపై కాకినాడ, తునిలోని పోలీసు స్టేషన్లలో ఆ శాఖ అధికారులు ఫిర్యాదులు చేశారు.

అక్రమాల గుట్టు రట్టు చేయాలని..

ఈ జీఎస్టీ అక్రమాల గుట్టును రట్టు చేసేందుకు కాకినాడ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయం అధికారులు సిద్ధమయ్యారు. జీఎస్టీ ఎగవేసిన కంపెనీలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే బినామీ ఆధార్‌ కార్డులతో కంపెనీలు రిజిస్టర్‌ చేయించి, లావాదేవీలు జరిపిన విషయం గుర్తించినట్లు సమాచారం. తమ జాబితాలో ఉన్న ఫొటోలు, ఆధార్‌ నంబర్ల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలన జరపగా.. వారిలో అసలు కొంత మంది అడ్రస్సులే దొరకడం లేదు. దీంతో, జీఎస్టీ ఎగ్గొట్టి, ఉడాయించిన అసలు ప్రబుద్ధులను పోలీసు విచారణ ద్వారా గుర్తించి, చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

అనుమతి ఎలా ఇచ్చారో..

ఏ కంపెనీ ఏర్పాటుకై నా దరఖాస్తు చేసే సమయంలో ఆధార్‌ కార్డు తప్పనిసరిగా జత చేయాలి. అందులోని వివరాలను అధికారులు సరి చూసుకున్న తరువాత ఆ కంపెనీ రిజిస్ట్రేషన్‌కు సంబంధిత అధికారులు అనుమతి ఇస్తారు. ఆవిధమైన పరిశీలన లేకుండానే ఈ కంపెనీలను రిజిస్టర్‌ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి ఇచ్చే క్రమంలో ఏదో ఒక స్థాయిలో ఎవరో ఒకరి పాత్ర లేకుండా ఈ వ్యవహారం జరగదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కంపెనీ రిజిస్టర్‌ అయిన తరువాత దాదాపు ఏడాదిన్నరగా లావాదేవీలు జరుపుతున్నా జీఎస్టీ జమ కావడం లేదనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. లావాదేవీలపై 18 శాతం వంతున జీఎస్టీ చెల్లించాలి. కేవలం పాత ఇనుము కొనుగోలు, అమ్మకాల్లోనే రూ.కోట్లలో జీఎస్టీ ఎగవేసిన వ్యవహారం వాణిజ్య పన్నుల శాఖకు తలపోటుగా మారింది. మొత్తంగా ఈ అక్రమ వ్యవహారంలో వ్యాపార లావాదేవీలు నిర్వహించి, ఆర్థికంగా లాభపడి, పన్ను ఎగవేసిన వారు అడ్రస్‌ లేకుండా పోయారు. తమ ప్రమేయం లేకున్నా తమ ఆధార్‌లతో ఆయా కంపెనీలను ప్రారంభించడంతో ఈ వ్యవహారం ఎక్కడ తమ పీకకు చుట్టుకుంటుందోననే భయంతో అమాయకులైన ఆయా కార్డుదారులు కలత చెందుతున్నారు.

·˘ ¼¯éÒ$ B«§éÆŠ‡ M>Æý‡$zÌS™ø

స్క్రాప్‌ కంపెనీల ఏర్పాటు

·˘ Æý‡*.20 MørÏMýS$ Oò³V> iGïÜt GVýSÐól™èl

·˘ BOò³ A{yýl‹Ü ÌôæMýS$…yé ç³Æ>ÆŠ‡

·˘ 12 Ð]l$…¨ Ð]l*Ķæ$V>âýæÏ¯]l$

గుర్తించిన వాణిజ్య పన్నుల శాఖ

·˘ ç³Ë$ ´ùÎ‹Ü õÜtçÙ¯]lÏÌZ íœÆ>ŧýl$

జీఎస్టీ.. ఎగ్గొట్టి1
1/1

జీఎస్టీ.. ఎగ్గొట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement