
సత్యదేవుని సన్నిధిన ధ్యాన మందిరం
అన్నవరం: సత్యదేవుని సన్నిఽధిలో చైన్నెకి చెందిన దాత గురుపరన్, శాంతి దంపతులు రూ.27 లక్షల వ్యయంతో ధ్యాన మందిరం నిర్మిస్తున్నారు. దీనికి విజయ దశమి పర్వదినమైన గురువారం నాడు వారు శంకుస్థాపన చేశారు. సత్యగిరిపై ఆగమ పాఠశాల సమీపాన ఈ ధ్యాన మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఎనిమిది నెలల్లో నిర్మాణం పూర్తి చేసి, దీనిని భక్తులకు అందుబాటులోకి తీసుకుని రావాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. శంకుస్థాపనలో ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ రామకృష్ణ కూడా పాల్గొన్నారు. దేవస్థానంలో వివిధ పథకాలకు గురుపరన్, శాంతి దంపతులు గతంలో రూ.25 లక్షల మేర విరాళాలు అందజేశారు.