
రత్నగిరిపై కొనసాగుతున్న రద్దీ
అన్నవరం: రత్నగిరిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి 50 వేల మంది భక్తులు ఆదివారం సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. క్యూ లైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తుల తో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామి ని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడికి, గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఆలయ ప్రాకారంలో ఉదయం 10 గంటలకు టేకు రథంపై ఊరేగించారు.
ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది
ఫ దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం