
పోలియో ఫండ్‌కు రూ.లక్ష విరాళం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ రోటరీ పోలియో ఫండ్‌కు క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ ఎస్‌వీఎస్ రావు సోమవారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు గోపీనాథ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు అంతర్జాతీయ రోటరీ కృషి చేస్తోందని చెప్పారు. ఫలితంగా నేడు పోలియో రహిత ప్రపంచంగా ప్రకటించడం గర్వకారణమని అన్నారు. ఇటీవల కొన్ని పోలియో కేసులు నమోదవడం పట్ల అంతర్జాతీయ రోటరీ ఆందోళన వ్యక్తం చేసిందని, ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్ వేయాలన్న దృక్పథంతో ఏటా రెండుసార్లు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి రోటరీ సభ్యులు విరాళాలు ఇప్పించాలని కోరారు. డాక్టర్ రావు విరాళం అందించడం పట్ల గోల్డెన్ జూబ్లీ క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ సాన, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి, నయన శ్రీరామ్ అభినందించారు.

పోలియో ఫండ్‌కు రూ.లక్ష విరాళం

పోలియో ఫండ్‌కు రూ.లక్ష విరాళం