
నేడు యూటీఎఫ్ రణభేరి
రాయవరం: సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు రణభేరి పేరుతో మోటార్ సైకిల్ జాతా నిర్వహించారు. యాప్‌ల పని భారం తగ్గించాలని, బోధనేతర పనులు వద్దని కోరుతూ, అలాగే వారి ఆర్థిక సమస్యల నేపథ్యంలో గురువారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి వెళ్తున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యూటీఎఫ్ శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, సుబ్బారావు తెలిపారు.
హైదరాబాద్‌కు
ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి కాకినాడ జిల్లాకు ప్రయాణీకులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎం.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే 9 సర్వీసుల రిజర్వేషన్లు ఫుల్ కావడంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 30 నుంచి అదనంగా నాలుగు బస్సులు, అక్టోబర్ 1 నుంచి ఏడు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెలవుల అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం అక్టోబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తునట్టు ఆయన తెలిపారు. రద్దీని బట్టి విజయవాడకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అన్నపూర్ణేశ్వరిగా దుర్గమ్మ
అన్నవరం: దసరా నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం రత్నగిరిపై దుర్గా మాతలను అన్నపూర్ణేశ్వరిగా అలంకరించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి అమ్మవార్లకు రుత్విక్కులు లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. ఆరు గంటలకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. ఏడు గంటలకు దర్బారు నిర్వహించారు. వేదపండితులు గొల్లపల్లి ఘనాపాఠీ, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం వనదుర్గ, కనకదుర్గ ఆలయ అర్చకస్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని బాలగా, మరో సువాసినిని అమ్మ ప్రతిరూపంగా అర్చించారు.

నేడు యూటీఎఫ్ రణభేరి

నేడు యూటీఎఫ్ రణభేరి