
సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం ఆగదు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం ఆగదని విద్యుత్ ఉద్యోగుల కార్మిక సంఘ నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం దశల వారి ఆందోళనలో భాగంగా విద్యుత్ సర్కిల్ ఆఫీస్ ప్రాంగణం వద్ద విద్యుత్ కార్మికులతో రిలే నిరాహార దీక్ష రెండో రోజు శనివారం కొనసాగించారు. కార్యక్రమంలో 50 మంది రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వారికి మద్దతుగా సుమారు 150 మంది తమ సంఘీభావాన్ని తెలియజేశారు. యాజమాన్యం ఇంతకుముందే అంగీకరించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు చేయని పలు డిమాండ్ల సాధన కోసం ఈ దశల వారి ఆందోళన కార్యక్రమం చేపట్టామన్నారు. ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ పింఛన్ విధానానికి అమలు చేయలని, జేఎల్‌ఎం గ్రేడ్–2 ఉద్యోగులను సంస్థలో విలీనం చేసి ప్రమోషన్లు కల్పించాలని, త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా ఇచ్చిన నూతన సర్వీస్ రెగ్యులేషనన్ రద్దు చేయాలన్నారు, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కాంట్రా క్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి వివిధ యూనియన్లు, అసోసియేషన్ల నాయకులు వి. బాలకుమార్, బి.పైడిరాజు, ఎస్.మురళీకృష్ణ, ఎన్‌ఎస్ నాయుడు, కె.బాబి, ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు.
శరన్నవరాత్ర ఉత్సవాలకు
సర్వం సిద్ధం
పిఠాపురం: పాదగయ క్షేత్రంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పాదగయ లో దసరా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయగా పిఠా పురం నియోజకవర్గంలో అమ్మవారి ఆలయాలు స ర్వాంగ సుందరంగా తయారయ్యాయి. ఈనెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు ని ర్వహించనుండగా అమ్మవారు కాత్యాయనిదేవిగా ప్ర త్యేక అవతారంలో దర్శనమివ్వనున్నారు. రోజుకో అ లంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో వెలసిన అష్టా దశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠం అయిన పురూహూతి కా అమ్మవారు, రాజరాజేశ్వరిదేవి, తాటిపర్తిలో వేంచేసిన అపర్ణాదేవి అమ్మవార్ల ఆలయాలను శరన్నవరాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు.