నువ్వా నేనా అనేట్టు.. | - | Sakshi
Sakshi News home page

నువ్వా నేనా అనేట్టు..

Dec 11 2023 2:02 AM | Updated on Dec 11 2023 2:02 AM

మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలతో నన్నయ వీసీ ఆచార్య పద్మరాజు  - Sakshi

మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలతో నన్నయ వీసీ ఆచార్య పద్మరాజు

ఉత్కంఠగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు

వేదికగా మారిన ‘నన్నయ’ వర్సిటీ

రాజానగరం: వెయిట్‌ లిఫ్టింగ్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది మహిళల్లో కరణం మల్లేశ్వరి, పురుషుల్లో కోడి రామ్మూర్తి. వారు తమ ప్రతిభతో ఈ క్రీడలో చెరగని, చెదరని ముద్ర వేశారు. ప్రస్తుతం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో ఎంతో మంది వారిని స్ఫూర్తిగా తీసుకుని సత్తా చాటాలని పోటీ పడుతున్నారు. ఇక్కడ రెండు రోజులుగా సౌత్‌ అండ్‌ వెస్ట్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ వెయిట్‌ లిఫ్టింగ్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ చాంపియన్‌ షిప్‌ 2023–24 పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. నాలుగు రోజుల పాటు (12 వరకు) జరిగే ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌, రాజస్తాన్‌, గోవా, పుదుచ్ఛేరి రాష్ట్రాలలోని 90 యూనివర్సిటీల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారు నువ్వా నేనా అనేలా సత్తా చాటుతూ పతకాలు కై వసం చేసుకుంటున్నారు. మహిళలు, పురుషులకు 20 కేటగిరీలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇప్పటికే 10 కేటగిరీలు పూర్తయ్యాయి.

10 కేటగిరీల్లో విజేతలు వీరే..

రెండో రోజైన ఆదివారానికి పది కేటగిరీలలో వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు పూర్తయ్యాయి. ఇందులో విజేతలకు నన్నయ వీసీ ఆచార్య కె.పద్మరాజు మెడల్స్‌, సర్టిఫికెట్లు బహూకరించారు. పురుషుల 55 కిలోల విభాగంలో ఆకాష్‌ శ్రీనివాస్‌ (నాంధేడ్‌ యూనివర్సిటీ, మహారాష్ట్ర), ఇ.కోటేశ్వరరావు (ఆదికవి నన్నయ యూనివర్సిటీ), పి.బాలాజీ (తిరువళ్లూరు యూనివర్సిటీ)లకు బంగారు, వెండి, కాంస్య పతకాలు వచ్చాయి. 61 కిలోల విభాగంలో రుతేశ్వర్‌ (తిరువళ్లూర్‌ యూనివర్సిటీ), సుబ్రహ్మణ్యం (మంగుళూరు యూనివర్సిటీ), ఎస్‌.అబ్దుల్‌ (రాయలసీమ యూనివర్సిటీ), 67 కిలోల విభాగంలో శ్యామ్‌ సుందర్‌రాజు (అన్నా యూనివర్సిటీ), పాండురంగ్‌ గైక్వాడ్‌ (భారతీయ విద్యా పీఠం్‌), సి.దినేష్‌ (యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌)లు మొదటి మూడు స్థానాలను నిలిచారు. 45 కిలోల మహిళల విభాగంలో బి.రాజేశ్వరి (ఆదికవి నన్నయ యూనివర్సిటీ), దోనే ఆపేక్ష దత్తరి (శివాజీ యూనివర్సిటీ, కొల్హాపూర్‌), పూనే హర్షద (సావిత్రీబాయ్‌ ఫూలే యూనివర్సిటీ, పూణే) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. 49 కిలోల విభాగంలో టి.అరతి రాఘవేంద్ర (శివాజీ యూనివర్సిటీ, కొల్హాపూర్‌), దల్వి సౌమ్య (యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి), బి.చంద్రిక (ఆదికవి నన్నయ యూనివర్సిటీ), 55 కిలోల విభాగంలో మానికం షీన్‌ (యూనివర్సిటీ ఆఫ్‌ కాలికట్‌), యుక్తిక (మంగుళూరు యూనివర్సిటీ), భామనే వైష్ణవి జ్ఞానేశ్వరి (ఆదికవి నన్నయ యూనివర్సిటీ), 59 కిలోల విభాగంలో టీఎం కీర్తన (యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌), ఎం.దీపనయోమి (ఆదికవి నన్నయ యూనివర్సిటీ), లిజా కంసా (యోగి వేమన యూనివర్సిటీ) మొదటి మూడు స్థానాలలో నిలిచి బహుమతులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల మనోభావాలు ఇలా..

ఇదే మొదటి సారి..

సౌత్‌ జోన్‌ పోటీల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ పోటీలలో 10వ ర్యాంకు సాధించాను. ఇక్కడకు రావడం ద్వారా జాతీయ స్థాయిలో హిమాచల్‌ప్రదేశ్‌లో ఫిబ్రవరిలో జరిగే పోటీలకు ఎంపికయ్యాను. మరింత ప్రతిభ చాటేందుకు కృషి చేస్తా. –దివ్య, తక్షశిల యూనివర్సిటీ, తమిళనాడు

రెట్టింపు ఉత్సాహంతో..

ఇటువంటి పోటీల్లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నా. గెలుపునకు అవసరమైన మెలకువలు తెలుస్తున్నాయి. ఈ పోటీలలో సిల్వర్‌ మెడల్‌ వచ్చింది. నేషనల్‌ గేమ్స్‌లో బ్రాంజ్‌, జోన్‌ లెవిల్‌లో సిల్వర్‌ మెడల్స్‌ సాధించాను. –మోహినీదీప, ఏలూరు

బంగారు పతకం సాధించా..

తమిళనాడు నాగర్‌కోయిల్‌లో జరిగిన పోటీలలో సిల్వర్‌ మెడల్‌, యూపీలో జరిగిన పోటీలలో బ్రాంజ్‌ మెడల్‌ అందుకున్నాను. ‘నన్నయ’లో జరుగుతున్న పోటీల్లో ఇంటర్‌జామ్‌లో గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాను.

–బైరెడ్డి రాజేశ్వరి,

విజయనగరం

టాలెంట్‌ అవసరం

జాతీయ స్థాయి పోటీలలో రాణించాలంటే చాలా టాలెంట్‌ ఉండాలి. ఆల్‌ ఇండియా స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించాను. ఐదు నేషనల్‌ మెడల్స్‌ ఉన్నాయి. ఇప్పటి వరకూ 15 చోట్ల జరిగిన వివిధ పోటీల్లో పాల్గొన్నా. మా కోచ్‌ మంచి శిక్షణ ఇస్తున్నారు.

–డి.గణేష్‌, ఉస్మానియా యూనివర్సిటీ,

తెలంగాణ

థర్డ్‌ ప్లేస్‌లో నిలిచా..

ఈ పోటీలలో గోల్డ్‌ మెడల్‌ అందుకోవాలనుకున్నా. కానీ థర్డ్‌ ప్లేస్‌లో నిలిచి, బ్రాంజ్‌ మెడల్‌ను సొంతం చేసుకున్నా. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను.

–మహాది బాలసువోడ్‌,

సావిత్రీభాయ్‌ఫూలే యూనివర్సిటీ, పూణే

నిరంతర సాధన

ఇటువంటి పోటీల్లో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఎంతో కృషి అవసరం. ముఖ్యంగా వెయిట్‌ లిఫ్టింగ్‌లో నిరంతరం సాధన ఉంటేనే విజయాన్ని అందుకోగలుగుతాం. ఈ పోటీలలో గోల్డ్‌ మెడల్‌ సాధించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నాను.

–రాజేంద్ర వైసాయే, శివాజీ యూనివర్సిటీ,

కొల్హాపూర్‌, మహారాష్ట్ర

వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్న క్రీడాకారిణి 
1
1/7

వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్న క్రీడాకారిణి

2
2/7

3
3/7

4
4/7

5
5/7

6
6/7

7
7/7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement