
రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం సందడిగా మారింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివాని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు. సత్యదేవుని దర్శించిన అనంతరం, భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి, జ్యోతులు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఏకాదశి పర్వదినం కావడంతో సత్యదేవునికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ స్వామి, అమ్మవార్లకు తులసి దళాలతో సహస్ర నామార్చన నిర్వహించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై ఊరేగించనున్నారు.
ఏకాదశి సందర్భంగా సత్యదేవునికి ప్రత్యేక పూజలు
స్వామిని దర్శించిన 40 వేల మంది
రూ.40 లక్షల ఆదాయం