
పవన్ కల్యాణ్ స్పందించాలి
వేలాది మందికి మేలు చేసేలా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానం ప్రారంభించారు. దీనిని దెబ్బ తీసేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించాలి. మాకు, మా కుటుంబాలకు న్యాయం చేయడానికి ఆయన ముందుకు రాక పోవడం చాలా దారుణం. ఆయన నియోజకవర్గం పిఠాపురం నుంచే పోరాటం ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకునేలా ఆయన చర్యలు తీసుకోవాలి.
– సీహెచ్ సునీల్, ఎండీయూ ఆపరేటర్, పిఠాపురం
మా జీవితాలను నాశనం చెయ్యొద్దు
ఏ దారీ లేని మాకు గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీవనోపాధి కల్పించారు. వేలాది కుటుంబాలకు దారి చూపించారు. ప్రజాసేవగా భావించి మేము ఈ వృత్తి నిర్వహిస్తున్నాం. అలాంటి మాకు అన్యాయం చేయడం దారుణం. మా జీవితాలను నాశనం చేయకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. న్యాయం చేయకపోతే ప్రాణాలు వదలడం తప్ప వేరే దారి లేదు.
– ఎన్.గంగాధరరావు,
ఎండీయూ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, కరప
మా పొట్ట కొట్టొద్దు
నిరుద్యోగులుగా ఉన్న మేము మా సొంత గ్రామాల్లో మా కాళ్లపై మేము బతికేలా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దారి చూపించారు. ఆయన పెట్టిన భిక్షతో వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వీలు కుదిరితే మరి కొంత మందికి బతుకుతెరువు చూపించాలి తప్ప ఉన్న ఉపాధి తీసేయకూడదు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. చావోరేవో తేల్చుకుంటాం.
– సిద్ధాంతపు రవికుమార్,
ఎండీయూ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా

పవన్ కల్యాణ్ స్పందించాలి

పవన్ కల్యాణ్ స్పందించాలి