
ఫ జై ఆంజనేయం.. జామకాయల హారం
మహాకాయుడిగా రూపుదాల్చి.. సాగర తరణానికి వాయువేగంతో.. ఒక్కుదుటన బయలుదేరిన ఆంజనేయ స్వామి వారిపై.. మహేంద్రగిరిన ఉన్న చెట్ల పూలన్నీ జలజలా రాలాయట. పర్వత సదృశమైన ఆయన దేహం రంగురంగుల పూల సోయగాలతో మెరిసిపోయిందట. ఇదంతా శ్రీరామాయణం సుందర కాండలో మహర్షి వాల్మీకి వర్ణన. ఆ స్థాయిలో కాకపోయినా.. రాజమహేంద్రవరం ఐదు బళ్ల మార్కెట్ సెంటర్లో వేంచేసియున్న ప్రసన్నాంజనేయస్వామి వారు శుక్రవారం నవ్యశోభతో దర్శనమిచ్చారు. ఆలయ 31వ వార్షికోత్సవం.. హనుమజ్జయంతి సందర్భంగా స్వామి వారిని శుక్రవారం జామకాయలతో విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ఆకు పూజలు, సిందూర పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
– ఆల్కాట్‌తోట
(రాజమహేంద్రవరం రూరల్)