
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్
● ఎంపీ వంగా గీత
● 23న ప్రత్తిపాడులో సామాజిక
సాధికార బస్సు యాత్ర
ప్రత్తిపాడు రూరల్: పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్‌తో కలిసి ధర్మవరంలో ఆదివారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 23న ప్రత్తిపాడులో నిర్వహించే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును వివరిస్తామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడూ చేయని విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకూ మేలు చేకూరిందని ఎంపీ గీత చెప్పారు.
ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మరోసారి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జేసీఎస్ మండల ఇన్‌చార్జ్ రామిశెట్టి చినబాబు, సొసైటీ చైర్మన్ గొంతిన సురేష్, పార్టీ శంఖవరం మండల కన్వీనర్ నరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
యాత్రా స్థలం పరిశీలన
ప్రత్తిపాడు: ఈ నెల 23న ప్రత్తిపాడులో సామాజిక సాధికార బస్సు యాత్ర, బహిరంగ సభ నిర్వహించేందుకు అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ పరిశీలించారు. దీనికి స్థానిక అల్లూరి సీతారామరాజు జంక్షన్ అనువుగా ఉంటుందని గుర్తించారు. అక్కడి నుంచి పెద్దాపురం డీఎస్పీ లతాకుమారితో కలిసి మెయిన్ రోడ్డు వెంబడి జాతీయ రహదారిపై ఉన్న పుత్ర చెరువు జంక్షన్ వరకూ కాలినడకన ఎమ్మెల్యే పర్యటించారు. మంత్రుల బస్సు యాత్రకు వచ్చే నాయకులు, కార్యకర్తల వాహనాల రాకపోకలకు వీలుగా మార్గాలను, సభాస్థలిని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుడాల విజయలక్ష్మి, ఎంపీపీ గోళ్ళ కాంతి సుధాకర్, జెడ్పీటీసీ సభ్యురాలు బెహరా రాజరాజేశ్వరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేరు కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ గోళ్ళ జయశేఖర్, లంపకలోవ సొసైటీ అధ్యక్షుడు గొంతిన సురేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
