కాకినాడ రూరల్: సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఏపీఐఐసీ (కాకినాడ) నిర్మించిన ఫుడ్ పార్కులో ఖాళీగా ఉన్న ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజరు మురళీమోహన్ కోరారు. ఫుడ్ పార్కులో మొత్తం 111 ప్లాట్లకు గాను 88ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి ఆహార సంబంధిత కార్యకలాపాలకు యూనిట్లు నెలకొల్పేందుకు ఆహ్వానిస్తున్నామని గురువారం తెలియజేశారు. వీటితో పాటు ఫుడ్ పార్కులో ఉన్న రెండు బిల్డింగ్‌లను అద్దె ప్రతిపాదికన కేటాయిస్తామన్నారు. వివరాలకు సెల్ నంబర్లు 94921 60357, 85198 54054లో సంప్రదించాలని ఆయన కోరారు.