అలంపూర్: రాష్ట్రస్థాయి హాకీ టోర్నీకి అలంపూర్ వేదిక కాబోతుంది. ఎస్‌జీఎఫ్ అండర్– 17 బాలుర విభాగంలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి ఎంపికై న క్రీడాకారులు తరలిరానున్నారు. పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాల మైదానంలో టోర్నీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా రు. గురువారం మైదానాన్ని చదును చేసే పనులు చేపట్టగా.. జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి, టోర్నీ కన్వీనర్ ఆనంద్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాసులు పర్యవేక్షించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


