శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం

Oct 9 2026 12:38 AM | Updated on Oct 9 2026 12:38 AM

గద్వాల క్రైం: శాంతి భద్రతల విషయంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రేతలపై నిఘా ఉంచి, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలను కట్టడి చేయడంతో పాటు నిందితులను రిమాండ్‌కు తరలించడంపై ఆయన సిబ్బందిని అభినందించారు. అలాగే రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌, గస్తీ పెంచాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించడంతో పాటు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విలేజ్‌ రోడ్డు సేఫ్టి కమిటీలను ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై ప్రత్యేక విచారణ చేపట్టాలని తెలిపారు. ఇసుక, మట్టి, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాతో పాటు పేకాట వంటి వాటిని కట్టడి చేయాలన్నారు. స్టేషన్‌లో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా, వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్‌, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement