గద్వాల క్రైం: దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా ఆస్పత్రిలో సదరం శిబిరాల నిర్వహణ కోసం నిర్మించిన భవనాన్ని గురువారం అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. వివిధ పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చే దివ్యాంగులకు సరైన భవనం లేక ఇబ్బందులకు గురయ్యేవారని తెలిపారు. సదరం శిబిరాల్లో సరైన వసతులు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించి.. ప్రత్యేకంగా రూ. 16.90లక్షలతో భవనం నిర్మించినట్లు చెప్పా రు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయి, ఆస్ప త్రి సూపరింటెండెంట్ ఝాన్సీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


