చట్టం.. కట్టుతప్పుతోంది? | - | Sakshi
Sakshi News home page

చట్టం.. కట్టుతప్పుతోంది?

Sep 17 2026 1:14 AM | Updated on Sep 17 2026 1:14 AM

జోగుళాంబ గద్వాల
.. కంపెనీలతో కాలుష్యం
కృష్ణా మండల సరిహద్దులోని కెమికల్‌ ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారు.

వాతావరణం

ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఉక్కపోత పెడుతుంది. సాయంత్రం జల్లులు కురిసే అవకాశం ఉంది.

–8లో u

గద్వాల: కులాంతర వివాహం చేసుకున్న దళితుడి ఇల్లు కూల్చివేత.. గద్వాల పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం.. విచారణ పేరిట మరో వ్యక్తిని హింసించడంతో మనస్తాపానికి గురై చెట్టుకు ఉరేసుకున్న ఘటనలో పోలీసులపై ఫిర్యాదు చేస్తూ, బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించడం.. ఇసుక, మట్టి మాఫియాతో కొందరు ఖాకీలు ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు.. భూ పంచాయితీలపై కొన్ని ఠాణాల్లో ఖాకీలే నేరుగా తీర్పులు ఇవ్వడం వంటి ఘటనలను చూస్తే.. జిల్లాలో చట్టం కట్టుతప్పుతోందా? చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే కంచె దాటుతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గద్వాలలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సెటిల్‌మెంట్ల దందా..

2023 సెప్టెంబర్‌ 27న గట్టుకు చెందిన ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌కు సంబంధించిన భూ పంచాయితీని గట్టు, గద్వాల రూరల్‌, కేటీదొడ్డి మండలాలకు చెందిన పోలీసు అధికారులు బెదిరింపులకు పాల్పడి అక్రమంగా సెటిల్‌మెంట్‌ చేశారు. ఈ ఘటన గట్టు మండల కేంద్రంలోని ఓ ముఖ్యనేత ఇంట్లో కూర్చుని మరీ తీర్పునివ్వడం అప్పట్లో సంచలనంగా మారింది.

● కేటీదొడ్డి మండలం పాతపాలెంలో భూ తగాదా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండి, ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకుని దౌర్జన్యం చేస్తూన్నారంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

మాఫియాలతో స్నేహం..

మరోవైపు ఇసుక, మట్టి మాఫియాకు కొందరు పోలీసులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇసుక దందాతో కాసులు వెనకేసుకోవచ్చనే కారణంతో కొన్ని ఠాణాలకు పోలీసు అధికారులు పైరవీలు చేసి మరీ పోస్టింగ్‌లు తీసుకుంటున్నారనే బలమైన ప్రచారం ఉంది.

నేటికీ అంటరానితనం..

నడిగడ్డ రాష్ట్ర సరిహద్దులోని ప్రాంతం. నిరక్షరాస్యతలో ఆసియా ఖండంలోనే అగ్రస్థానం. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఈ ప్రాంతంలో అంటరానితనం, కులవివక్షత ప్రస్పుటంగా కనిపిస్తాయి. అంతేకాకుండా జోగిని వ్యవస్థ కూడా కొనసాగుతోంది. నేటికీ గట్టు, కేటీదొడ్డి, మల్దకల్‌, ఎర్రవల్లి, మానవపాడు తదితర మండలాల్లో రెండు గ్లాసుల విధానం కనిపిస్తోంది. తాజాగా కులాంతర వివాహం చేసుకున్నారనే నెపంతో గద్వాల మండలం రేపల్లెలో దళితుడి ఇంటిని జేసీబీలతో కూల్చివేశారంటే నడిగడ్డలో కులవివక్షత ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

పోలీసులే కారణమంటూ

ఆత్మహత్య..

గద్వాల పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ బాలు వేధింపులకు పాల్పడుతున్నారంటూ ధరూరు మండలం బూరెడ్డిపల్లికి చెందిన కమ్మరి నరేశ్‌ ఈ నెల 5న హైదరాబాద్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. అతడు చికిత్స పొందుతూ మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఓ కేసులో వ్యక్తి ఆచూకీ పేరిట ఆరు నెలల క్రితం మల్దకల్‌కు చెందిన కుమ్మరి శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అయితే ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భర్త మృతికి పోలీసులే కారణమని పేర్కొంటూ మృతుడి భార్య కుమ్మరి పద్మ హైకోర్టును ఆశ్రయించింది.

ఆరోపణలు అవాస్తవం..

కమ్మరి నరేశ్‌పై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. తనపై చేసిన ఆరోపణలు అవాస్తవం. ఆయన భార్య ఫిర్యాదు మేరకే నరేశ్‌ను కౌన్సెలింగ్‌ కోసం పిలవడం జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– కళ్యాణ్‌కుమార్‌, ఎస్‌ఐ, గద్వాలటౌన్‌

కన్నెత్తి చూడని అధికారులు..

గద్వాల మండలం రేపల్లెలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని జేసీబీలతో కూల్చివేసి, బీభత్సం సృష్టించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి.. గ్రామంలో అంటరానితనం, కులవివక్షతను అడ్డుకట్ట వేసేలా, సాధారణ స్థితిని నెలకొల్పేలా చర్యలు తీసుకోవాల్సిన పోలీసు, రెవెన్యూ శాఖలకు చెందిన జిల్లాస్థాయి ఉన్నతాధికారులు కనీసం గ్రామాన్ని కూడా సందర్శించలేదు. ఎలాంటి గ్రామసభ నిర్వహించలేదు.

భగ్గుమంటున్న దళిత సంఘాలు..

రేపల్లె ఘటనపై దళిత సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. నేటికీ కులవివక్షత, అంటరానితనం కొనసాగడం అధికారుల అచేతన స్థితిని తెలియజేస్తుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు కలెక్టర్‌, ఎస్పీలు గ్రామాన్ని సందర్శించలేదని.. కుటుంబాన్ని పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు దళితులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలన్నారు.

జిల్లాలో అబాసుపాలవుతున్న వైనం

గద్వాల పోలీసులు వేధిస్తున్నారంటూ

ఓ యువకుడు ఆత్మహత్య

ఆరు నెలల క్రితం మరో వ్యక్తి బలవన్మరణం.. హైకోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబం

ఇసుక, మట్టి మాఫియాతో ముడుపుల ఆరోపణలు

పోలీసుల వ్యవహార తీరుపై

సర్వత్రా విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement