గద్వాల క్రైం: సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిశిక పాత్రుడు అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో సైబర్ వారియర్స్ విభాగం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సరికొత్త పంథాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. సెల్‌ఫోన్‌కు వచ్చే సందేశాలకు స్పందించి వ్యక్తిగత సమాచారం ఇవ్వడం, ఎక్కువ లాభాలు వస్తాయని షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి వాటి ద్వారా మోసాలకు గురవుతున్నారని తెలిపారు. సైబర్ వారియర్స్ అప్రమత్తంగా ఉంటూ.. ప్రజలకు సైబర్ మోసాలను వివరించాలని సూచించారు. ముఖ్యంగా యువత, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.


