నగదు లావాదేవీలే మేలు | - | Sakshi
Sakshi News home page

నగదు లావాదేవీలే మేలు

Sep 17 2026 1:14 AM | Updated on Sep 17 2026 1:14 AM

ప్రస్తుతం ప్రయాణాలు, ఫోన్‌, విద్యుత్‌, పెట్రోల్‌ వంటి చెల్లింపులు ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో యూపీఐ ద్వారా రూ.2 వేలకుపైగా చేసే చెల్లింపులపై ఎండీఆర్‌ చార్జీలు వసూలు చేస్తే మాలాంటి మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతుంది. ఇప్పటికే సైబర్‌ నేరాలతో ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే డిజిటల్‌ చెల్లింపుల కంటే పాత విధానమైన నగదు లావాదేవీలే మేలు, సురక్షితం.

– రమేష్‌, గద్వాల

ప్రభుత్వం పునరాలోచించాలి..

రోజు 20 నుంచి 25 వరకు యూపీఐ పేమెంట్స్‌ ద్వారా ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. యూపీఐ పేమెంట్‌ రూ.2వేల వరకు మాత్రమే మినహాయింపుతో వినియోగదారుడు నష్టపోయే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ పేమెంట్‌ చేసినప్పుడు వినియోగదారుడిపైనే భారం వేస్తారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి.

– సురేశ్‌బాబు,

సురభి సూపర్‌ మార్కెట్‌, నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement