భూత్పురు కాల్వ ద్వారా వచ్చే సాగునీటితో అమరచింత పెద్ద చెరువు నిండి అలుగు పారేది. ఈసా రి కాల్వకు సాగునీరు విడుదల చేస్తున్నా ఎగువలో ఉన్న రైతులు దిగువకు నీరు వెళ్లకుండా తూములను మూసివేసి, నీటిని తమ తమ గ్రామాలకు మళ్లించుకుంటున్నారు. దీంతో అమరచింత పెద్ద చెరువు నీరులేక బోసిపోయింది. బోరుబావులు కూడా రీచార్జి కావడం లేదు. పంటలు ఎండుముఖం పడుతున్నాయి.
– లక్ష్మీనారాయణ, రైతు, అమరచింత
లష్కర్‌తో పర్యవేక్షణ..
మక్తల్ మండలం నుంచి నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల వరకు విస్తరించి ఉన్న భూత్పురు కాల్వ వెంట లష్కర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. 32 కి.మీ. పొడవునా ఉన్న కాల్వ వెంట ముగ్గురు లష్కర్లు మాత్రమే ఉన్నారు. తూముల షట్టర్లు ధ్వంసం చేశారని తెలుసుకున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిత్యం కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం.
– బాలకృష్ణ, ఏఈ, ఇరిగేషన్‌శాఖ
●


