ప్రభుత్వం పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మొక్కలు నాటడమే లక్ష్యంగా కాకుండా అవి పెరిగే వరకు సంరక్షించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటడంతోపాటు నీటి వసతి, రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. లక్షలో మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో బతికి ఉన్నవి ఎన్ని.. వాటి జాడ ఎక్కడ.. అనే దానిపై అధికారులు సమగ్రంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. కానీ, ఇంత వరకు బతికిన మొక్కల వివరాలు లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది జిల్లాకు వన మహోత్సవంలో భాగంగా 11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటికే 10 లక్షల మేర మొక్కలు నాటినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నారు. మరి ఇందులో ఎన్ని బతుకుతాయో వేచిచూడాలి.


