ఇటిక్యాల: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా రెవెన్యూ యంత్రాగం పనిచేయాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఇటిక్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై ప్రజలు అందించే అర్జీల పరిష్కారంపై నిర్ల క్ష్యం చేయొద్దన్నారు. పెండింగ్ దరఖాస్తులను ని బంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ కార్యాలయానికి వ చ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది సమయపాలన పాటించాలన్నా రు. సర్ ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తిచేసే లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్‌ఐలు మధు, మనోహర్ ఉన్నారు.


